ఈరోజు తొలి ఏకాదశి(ఏపీ హైలెట్స్ రిపోర్టర్ మాచవరం) సందర్భంగా పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము నకు భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది. మరియు వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది .
సదరు అన్నదాన నిమిత్తం అశోక్ డెవలపర్స్ హైదరాబాదు వారు పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు, మరియు శ్రీ బత్తుల శ్రీనివాసరావు గారు ఏ డి ఈ, ఏపీ ట్రాన్స్కో సత్తెనపల్లి వారు స్వామివారికి మరియు అమ్మవారికి దీపాలంకరణ నిమిత్తం సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువగల కుందులను అందజేశారు.
మాచవరం పోలీసు department వారు బందోబస్తు ఏర్పాటు చేసినారు .
దాచేపల్లి CI khajavali గారు దేవాలయo నకు వచ్చి స్వామి వారి కి పూజలు చేసుకున్నారు.