Blog Image

పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామ సమీపంలో గల శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా భ్రమరాంబ అమ్మవారికి లలితా సహస్రనామం మరియు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సదరు కార్యక్రమంలో పరిసర ప్రాంతంలో గల మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి అమ్మవారికి అవసరమైన పూజా ద్రవ్యములు, ప్రసాదములు దాచేపల్లి గ్రామస్తులైనటువంటి రాజనాల కోటేశ్వరరావు వారి ధర్మపత్ని అందజేశారని ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు తెలియజేశారు. బుగ్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం మొర్జంపాడు.

August 28, 2026