దేవాలయ చరిత్ర

శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానము

బుగ్గమల్లేశ్వరం, మోర్జంపాడు గ్రామం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

landscape view of temple

ఆలయ దృశ్యం (Landscape View)

మోర్జంపాడు గ్రామ సమీపమున గల శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగినట్లుగా శిలా శాసనం ద్వారా తెలియుచున్నది. ఈ పురాతన ఆలయం సువిశాలమైన అంతరాలయం మరియు 16 స్థంభములతో కూడిన ముఖ మండపముతో విరాజిల్లుతున్నది.

బుగ్గ మల్లేశ్వర స్వామి విశిష్టత

గర్భాలయంలో శివ లింగము పక్కన నీటి బుగ్గ కలదు. ఈ నీటి బుగ్గ నుండి ఎంత నీరు తీసిననూ తరగక, తిరిగి అంతే నీటితో నిండి ఉండటం ఇక్కడి విశేషం. ఈ గంగాజలంతోనే స్వామి వారికి అభిషేకములు జరుపబడును. సూర్య రశ్మి సోకకపోయినా ఈ నీరు చెడిపోక ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండటం ఈ క్షేత్ర మహిమకు నిదర్శనం.

ఉత్తర వాహినిగా ప్రవహించుచున్న కృష్ణా నది తీరాన వెలసిన ఈ స్వయంభూ క్షేత్రం అనుష్ఠాన సాఫల్యతకు అత్యంత విశేషమైనది. పూర్వం మహర్షులు ఈ నదిలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. అందువల్ల ఈ ఆలయం "ఋషి ప్రతిష్ట" గా ప్రసిద్ధి చెందింది.

ఆలయ శిలాఫలకం

Sunlight in temple

శ్రీ భ్రమరాంబా అమ్మవారు

Sri Bhramarambika Temple

శ్రీ భ్రమరాంబా అమ్మవారి ఆలయం

శ్రీశైలం మాదిరిగానే ఇక్కడ కూడా వాయువ్య భాగాన ఎత్తయిన ప్రదేశంలో శ్రీ భ్రమరాంబా అమ్మవారు కొలువై ఉండటం మరో విశేషం. అమ్మవారి విగ్రహం అత్యంత సౌందర్యంతో, భక్తులకు అభయప్రదాతగా నిలుస్తుంది.

వృద్ధ మల్లేశ్వర స్వామి

Vridha Malleshwara Temple

వృద్ధ మల్లేశ్వర స్వామి ఆలయం

శ్రీశైల క్షేత్రంలో ఉన్న విధముగా ఈ ఆలయ ప్రాంగణంలో వృద్ధ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయ ప్రాంగణం మరియు ఉపాలయాలు

ఈ క్షేత్రంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, మృత్యుంజయ సహిత నవగ్రహ మండపం మరియు యాగశాల వంటి ఉప ఆలయాలు భక్తులతో అలరారుతున్నాయి.

Sri Subrahmanya Swamy Temple

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

శివకేశవులు ఒకే చోట కొలువైన ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

చారిత్రక నేపథ్యం

18వ శతాబ్దంలో అమరావతీ సంస్థానాధీశుడు, పరమ శివభక్తుడైన శ్రీవాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు కామేపల్లి గ్రామ పర్యటనకు వచ్చినసమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించారు. శివారాధన చేయకుండా ఆహారంతీసుకోకూడని నియమం గల వారు కావున, ఈ అడవిలో ఉన్న ఆలయాన్నిదర్శించి అభిషేకాలు నిర్వహించారు.

ఆ సమయంలో దేవాలయ ధర్మకర్త అయిన శ్రీ మండాది సీతారామయ్య గారిద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్న సంస్థానాధీశుడు, ఆలయఅభివృద్ధికి ఎంతో మాన్యాన్ని (భూమి) బహుకరించినట్లు చరిత్ర ద్వారాతెలియుచున్నది.

శ్రీ రామ మరియు ఆంజనేయ స్వామి ఆలయం

ఆలయ దక్షిణ భాగంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, దానికి ఎదురుగా ఈ క్షేత్ర పాలకునిగా కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉన్నాయి.

Sri Rama Temple

శ్రీ రామ ఆలయం

Sri Anjaneya Temple

శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం

సర్వేజనాః సుఖినోభవంతు